గూగుల్ కు భారతీయుడే..

sundar-pichai

ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కు మరో భారతీయుడు సీఈవోగా నియమితులయ్యాడు.. మొన్నటికి మొన్న మైక్రోసాఫ్ట్ కు సత్య నాదెళ్ల సీఈవోగా నియమితులు కాగా.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ గూగుల్ కంపెనీకి మరో భారతీయుడు చైన్నైకి చెందిన సుందర్ పిచ్చై సీఈవోగా నియమితులయ్యారు.

సుందర్ ఇంతకుముందు గూగుల్ ఇంటరె్నట్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ బాధ్యతలు నిర్వర్తించేవాడు.. ఇందులో బాగా హిట్ అయిన ఉత్పత్తి.. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్… ఇప్పుడు ప్రపంచంలో ప్రతీ మోబైల్ లో ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేరే వాడుతున్నారు.  దీంతో ఆయన ప్రతిభ సామర్థ్యాలను గుర్తించిన గుగుల్ సీఈవో లారీ పేజ్ , బోర్డు సుందర్ పిచ్చైను గూగుల్ సీఈవోగా నియమిస్తూ తీర్మానించారు.

కాగా గూగుల్ ను సైతం పునర్వ్యస్తీకరించారు. గూగుల్ ను ఆల్ఫాబెట్  కంపెనీగా మార్చారు. దీనికి సీఈవోగా గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీపేజ్ వ్యవహరిస్తారు. గూగుల్ ను విడగొట్టి సపరేట్ చేసి దానికి సుందర్ ను సీఈవోగా నియమితులయ్యారు.

కాగా సుందర్ కు అభినందనలు వెల్లువెత్తాయి.. ప్రధాని నరేంద్ర మోడీ, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, కేంద్ర మంత్రులు, నాస్కామ్ ఎండీ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *