Breaking News

గులాబీ గూటికి మరో పది మంది క్యూ..

12477Large-

గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే ఇద్దరు టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కారెక్కారు.. మరో పది మంది ప్రజాప్రతినిధులు కూడా త్వరలో కారు ఎక్కబోతున్నట్టు సమాచారం. ప్రజాప్రతినిధులను ఆకర్శించి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా విపక్షాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది..

శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికలు, హైదరాబాద్, వరంగల్ ,ఖమ్మం మహానగర పాలక సంస్థ ఎన్నికల్లోపు టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా  పకడ్బందీ వ్యూహం పన్నుతోంది.. ఇప్పటికే టీడీపీ పత్తా లేకుండా పోతోంది.. టీడీపీ ఎమ్మెల్యే సాయన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకమండలి సభ్యుడిగా మంచి ఆదాయ వనరున్నా కూడా రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ లో చేరారు.

కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ , టీడీపీ లనుంచి మరో నలుగురు ఎమ్మెల్సీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ముహూర్తం చూసుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు చేరాలని నిర్ణయించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *