
పాలకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో చేపడుతున్నఅభివృద్ధిని చూసి రోజురోజకు టీఆర్ఎస్ లో పెరుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలో కాంగ్రెస్ నుంచి పది కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ చేరుతున్న ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఎన్నికల్లో పార్టీ గెలుపునకు క్షేత్రస్థాయిలో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లబ్ధిదారులను చైతన్యవంతం చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. అంతకుముందు పార్టీలో చేరిన వారిలో నోముల మల్లేష్, హరి, మునయ్య, ఉప్పలయ్య, కప్ప సోమయ్య, వసూరి నర్సయ్య, సారయ్య తదితరులు ఉన్నారు.