
గుజరాత్ కు బాగా కలిసొచ్చింది. బ్యాటింగ్ లో ఇరగదీసే డ్వేన్ స్మిత్ బౌలింగ్ కు దిగి కోల్ కత కథ ముగించాడు. ఇది చాలా అరుదుగా సంభవించే సంఘటన అయినా కోల్ కత ఓడిపోయి తమ ఫ్లేఆఫ్ ను సంక్లిష్టం చేసుకోవడానికి ప్రధాన కారణం డ్వేన్ స్మిత్.
డ్వేన్ స్మిత్ కేవలం 4 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు.దీంతో కోల్ కత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 124 పరుగులే చేసింది. అనంతరం రైనా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. 13.3 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసి గుజరాత్ కు విజయాన్నందించాడు. సురేశ్ రైనా 53 నాటౌట్ (36 బంతుల్లో)తో రాణించడంతో గుజరాత్ కు విజయం వరించింది.