
గుంటూరు జిల్లాలో భూసేకరణలో భూములు కోల్పోయే రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై రాయి విసిరారు ఓ ఆగంతకుడు.. ఆదివారం మధ్యాహ్నం పెనుమాక రైతులతో పవన్ సమావేశమయ్యారు. రైతులతో మాట్లాడుతున్న ఆయనపై గుర్తు తెలియని ఆగంతకుడు రాయి విసిరాడు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. వేదికపై నున్నపవన్ కు సమీపంలోని రాయి పడింది. ఆ రాయిని చేతిలో ఉంచుకొనే రైతులతో మాట్లాడారు.
మీరు ఓటు వేయమంటేనే టీడీపికి వేశామని.. ఇప్పుడు తమ భూములే తీసుకొని నట్టేట ముంచుతున్నారని రైతులు పవన్ కు వివరించారు.భయపెట్టి, ఫూలింగ్ పేరుతో తమ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు.