Breaking News

గీతా కార్మికులకు మిషన్లు..

గీతా కార్మికులకు మిషన్లు

గీతా కార్మికులను ప్రమాదాలనుంచి రక్షించేందుకు మోకు,ముత్తాదులకు బదులు తాడి చెట్టు ఎక్కేందుకు యంత్రాలను సమకురుస్తామని భువనగిరి ఎం.పి.బూర నర్సయ్యగౌడ్ హామీ ఇచ్చారు. శనివారం నాడు కరీంనగర్ లో జరిగిన గౌడ హాస్టల్ 35వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాటి చెట్టునుండి కిందపడి ఎందరో గీతా కార్మికులు మృత్యువాత పడుతున్నారని, ఈ ప్రమాదాలను నివారించేందుకు, చెట్టు ఎక్కేందుకు ప్రత్యేక యంత్రాలను సమకూర్చుకోవలసిన అవసరం ఉందన్నారు. కేరళ రాష్ర్తం నుండి మిషన్లు తెప్పించి నల్గోండ,కరీంనగర్,వరంగల్ జిల్లాలలో తాటి చెట్టు ఎక్కేందుకు ఉపయోగపడే  100 మిషన్లు గీతా కార్మికులకు అందజేస్తామని, ఈ ప్రక్రియ విజయవంతం అయితే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గీతా కార్మికులకు యంత్రాలు సరఫరా చేస్తామన్నారు. ఒక్కోక్క మిషన్ కి కేవలం 4000రూపాయల ధర వుంటుందని బూర నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కే.స్వామిగౌడ్ మాట్లాడుతూ,  గీతా కార్మికులు ఐక్యంగా వుండి రాజకీయంగా ఎదగాలన్నారు.  ఆర్ధికంగా ఎదగినప్పుడే రాజకీయంగా ఎదుగుదల ఉంటుందన్నారు. ఆర్ధికంగా గౌడ్స్ వెనుకబడి ఉండటంవల్లనే గౌడ కులస్తులు సర్పంచ్ లు,  ఎం.పి.టి.సి లు, జడ్.పి.టి.సి ల పదవుల వరకే పరిమితం అవుతున్నారని, వీరంతా ఎమ్మేల్యేలు, ఎం.పి లుగా ఎన్నికయ్యెందుకు గౌడన్నలు ఐక్యంగా కృషి చేయాలన్నారు. గౌడ్ హాస్టల్ నిర్మాణం కోసం తనవంతుగా ఒక  గది నిర్మాణానికి రెండున్నర లక్షల విరాళాన్ని స్వామిగౌడ్ ప్రకటిచారు.

గీతా కార్మికులకు మిషన్లు

గీతా కార్మికులకు మిషన్లు

new goudరాజ్యసభ సభ్యులు టి.దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ గౌడ హాస్టల్ ను ఆదర్శంగా తీసుకోని తెలంగాణలోని అన్నిజిల్లాల్లో గౌడ్ హాస్టల్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ హాస్టళ్ళ నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కరీంనగర్ గౌడ హాస్టల్ నిర్మాణం కోసం హైదరాబాద్ కు చెందిన జంగారావు గౌడ్ 5లక్షల రూపాయల చెక్కును విరాళంగా సభాధ్యక్షులు కరీంనగర్ మాజి ఎం.పి పొన్నం ప్రభాకర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహాబూబ్ నగర్ ఎమ్మేల్యే శ్రీనివాస్ గౌడ్, మాజి మంత్రి గొడిశెల రాజేశం గౌడ్,  చొప్పదండి మాజి ఎమ్మేల్యే కోడూరి సత్యనారయణ గౌడ్, తూళ్ళ వీరేందర్ గౌడ్,  గౌడ హాస్టల్ అధ్యక్షులు బూరుగు సత్యనారయణ గౌడ్, గౌడ సంఘల నాయకులు బండి నర్సాగౌడ్, పల్లె లక్ష్మణ్ గౌడ్, డా.చంద్రశేఖర్ గౌడ్, అయిలు రమేష్ గౌడ్, బుర్ర కొండయ్య గౌడ్, పులి లక్ష్మిపతి గౌడ్, నాగుల సత్యనారయణ గౌడ్, రాంచంద్రంగౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, పొన్నం సత్యం గౌడ్, తాళ్ళ పెళ్ళి హరికుమార్ గౌడ్, కోట రవి గౌడ్, కరబూజ తిరుపతి గౌడ్, శంకర్ గౌడ్, కలర్  సత్తన్న గౌడ్, రామగుండం సత్తన్న గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *