గిరీష్ కర్నాడ్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జూన్ 24వ తేది సోమవారం గిరీష్ కర్నాడ్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమయింది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బిసి కమీషన్ చైర్మన్ బిఎస్ రాములు విచ్చేసి గిరీష్ కర్నాడ్ కు నివాళులు అర్పించి, ఫెస్టివల్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా

బిఎస్ రాములు మాట్లాడుతూ… భారతదేశం సాహిత్యకళారంగం గర్వించదగ్గ గొప్ప ప్రతిభాశీలి గిరీష్ కర్నాడ్ తను చూసిన సామాజిక సంఘటనలను ఇతివృత్తాలను నేపథ్యాలుగా తీసుకొని ఆయా అంశాలతో నాటకాలు,కథలు రాయడమేకాకుండా సినిమాలు కూడా తీసాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ సంస్కృతి కళల్ని పరిరక్షించడమేకాకుండా ఇతర రాష్ట్రాల, దేశాల సంస్కృతి కళలకు కూడా సముచిత గౌరవం అందుతున్నదని అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ నుండి గిరిష్ కర్నాడ్ కు సినీ నీరాజనంగా గిరీష్ కర్నాడ్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించడం మంచి పరిణామని పేర్కొంటూ, సంచాలకులు మామిడి హరికృష్ణను అభినందించారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… సినిమాకథకి సూత్రాలు ఏంటి అనే విషయాన్ని తెలుపులూ సినిమాకళని ఆస్వాదించి ఆనందించే విధానాన్ని యంగ్ ఫిలిం మేకర్స్ కు నేర్పడంకోసం క్లాసిక్ సినిమాలను పైడి జైరాజ్ థియేటర్ వేదికగా ప్రదర్శిస్తున్నామని, ఈ వేదికలో సంగ్రహించిన సినిమా నాలెడ్జ్ తో, టెక్నికల్ అంశాలతో ఇదే స్ఫూర్తితో రాబోయేకాలంలో యంగ్ ఫిలిం మేకర్స్ తమ సినిమాలు రూపొందిచాలన్నారు.

ఈ కార్యక్రమంలో జోత్స, ఒగ్గు రవి, సతీష్ కుమార్ అడ్ల, రమేష్ కిషన్, శరత్ సుంకరి, శ్రవణ్ కుమార్ ఏపూరి మరియు సినీప్రియులు పాల్గొన్నారు. తొలిరోజు సంస్కార, వంశవృక్ష అనే కన్నడ సినిమాలు ప్రదర్శించారు. మంగళవారం మ. 2 గంటలకు కాడు (కన్నడ), సా. గం. 6.30 ని.లకు మంథన్ (హిందీ) సినిమాలను ప్రదర్శించనున్నారు.

giriesh     giriesh 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *