
– 22న నాగోబాను సందర్శించనున్న సీఎం కేసీఆర్
ఆదిలాబాద్, ప్రతినిధి : ఆదిలాబాద్ గిరిజన గూడాల్లో నాగోబా నామ స్మరణ మారిమోగిపోతోంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర సోమవారం నుంచి మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొలువైన నాగోబాకు గిరిజనులు తమ తరాల తరాల సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు.. గోదావరి నుంచి జలాన్ని తీసుకొచ్చి మట్టితో కుండలు తయారు దేవతకు అభిషేకం చేస్తారు… మెస్రం వంశీయులు 50 మంది మహిళలు ఉపవాస దీక్షలు చేసి పూజలు చేసిన అనంతరం 22 పొయ్యిలు ఏర్పాటు మహిళలు వంట చేసి పురుషులకు వండిపెడతారు. చివరి రోజు మహిళలంతా ముసుగులు ధరించి నాగోబా ఆలయంలో పూజలు చేస్తారు.
ఆద్యంతం గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగే ఈ జాతరకు ఈ నెల 22న సీఎం కేసీఆర్ వచ్చి నాగోబా ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి ఆదివాసీలపై వరాలు కురిపించనున్నారు.