
తెలంగాణ రాష్ట్ర జానపద చరిత్ర లో మొట్ట మొదటి సారిగా ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను వరంగల్ రూరల్ జిల్లా, పర్వతగిరి మండలం, చౌటపల్లి గ్రామానికి చెందిన శ్రీ శాంతి క్రిష్ణ సేవ సమితి సాదించటం రాష్ట్రానికే గర్వకారణమని పంచాయతీరాజ్ శాఖా మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సందర్బంగా సమితి అధ్యక్షుడు శాంతి క్రిష్ణ ను హైదరాబాద్ లోని తన నివాస గృహంలో ఘనంగా సన్మానించారు, గత 34సంవత్సరాలుగా శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి చేస్తున్న సేవా కృషి వల్ల ఎంతో మంది కళాకారులు, క్రీడాకారులు అభివృద్దిలోకి వచ్చారన్నారు.
వైద్య, ఆరోగ్య క్యాంపుల తో పాటు విద్యారంగ సేవలు, గ్రామీణాభివృద్ది పట్ల వీరు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
బతుకమ్మ తల్లి జన్మ స్థలమైన చౌటపల్లి కి గుర్తింపు తీసుకురావడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చెస్తున్నారని అన్నారు..