గిజిగాడు తన గూడు వదిలిపోయాడు..

గిజిగాడు తన గూడు వదిలిపోయాడు. కాంక్రీటు జనారణ్యంలోకి వచ్చాడు. చెట్లు చేమలు అంతరించిపోతున్న వేళ పిచ్చుకలు, పక్షులు గూడు చెదిరి నగరాలు, పట్టణాలు, గ్రామాలకు తరలివస్తున్నాయి. ఇంటి దాబాలు, ఇంటిలోపక మరుగు ప్రదేశాల్లో తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మానువుడి ఆధునికత  పక్షుల మనుగడకు ముప్పు తెస్తోంది.

picplant-sparrow

పూర్వం అడవులు సంవృద్ది గా ఉండేవి. చెట్లు చేమలతో పక్షులకు ఆహారం సంవృద్ధిగా దొరికేది. దీంతో అవి చెట్ల చివర్లలో గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టేవి. కానీ ఇప్పుడో అడవులు పోయాయి.. చెట్లు పోయాయి.. జనాభా పెరుగుదల, అడవుల అంతరించిపోవడం.. చెట్లు చేమలు కనుమరుగైపోయాయి. సెల్ టవర్ల రేడియేషన్ల వల్ల పక్షుల మనుగడకే ముప్పు వాటిల్లింది. దీంతో అవి అడవులను విడచి తమ గూడు పట్టణాలకు మార్చాయి.

IMAG0012

ఇటీవల గ్రామాలు, పట్టణాల్లోని ఇండ్లపై మరుగు ఉన్న ఇంటి స్లాబ్ లు, సజ్జలపై పిచ్చుకలు గూడులు ఏర్పాటుచేసుకొని గుడ్లు పెట్టుకుంటున్నాయి. ఈ తరహా పిచ్చుకల వలసలు పెరిగిపోయాయి. అంతరించిపోతున్న వాటి మనుగడకు పట్టణాల్లో పెంచుకుంటున్న చిన్న చిన్న పండ్లే చెట్టే పెద్ద దిక్కవుతున్నాయి. పట్టణాల్లో అలంకార కోసం ప్రజలు పెట్టుకుంటున్న పండ్ల మొక్కలపైనే ఆధారపడి అవి జీవిస్తున్నాయి. దీంతో ఇక్కడే అవి నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి.

సో గిజిగాడు తన గూడు మార్చుకున్నాడు. పట్టణాలకు వలసవచ్చి కాంక్రీటు జనారాణ్యంలోకి వలస వచ్చాడు. పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకమైన వేళ వాటి కొత్త జీవితాలు పట్టణాలలోని ఆహారం లభించే ప్రాంతాల్లో నివసిస్తూ మనుగడ సాధిస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *