గాలిపటం దెబ్బకు కాంగ్రెస్, టీఆర్ఎస్ బేజారు

ఎంఐఎం అడ్డుగోడలు చేధించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలకు అవమానమే దక్కింది.. ఇన్నాళ్లు దోస్తీ చేసుకున్న కాంగ్రెస్, ఎంఐఎంలు ఇలా పాతబస్తీలో వైరిపక్షాలుగా కొట్టుకోవడం నిజంగా విస్మయం కలిగించింది.. ఎంఐఎం అడ్డాలోకి ఎవరిని దూరనివ్వదు.. నిలువనీయదు.అక్కడ అభివృద్ధిని చేయనీయదు.. కొన్నేళ్లు కాంగ్రెస్ , ఇతర పార్టీలు చేసిన ఈ స్వకార్యమిత్రుత్వాన్ని ఉపయోగించుకొని ఎంఐఎం పాతబస్తీలో పటిష్ట గోడలు కట్టుకుంది. ఇప్పుడు కూల్చుదామని వెళ్లిన కాంగ్రెస్ , టీఆర్ఎస్ లకు దెబ్బతిన్నారు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా ఆ ‘గాలిపటం..’ అసలు వాళ్లకు అడ్డుకట్ట లేదా అంటే మున్ముందు ఉంటుందని ఆశిద్దాం..

ఇక నిన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి., మరో నేత, స్వయాన ముస్లిం అయిన షబ్బీర్ అలీ కార్లో పాతబస్తీలో జరుగుతున్న ఎన్నికల అక్రమాలపై నిలదీయడానికి వెళ్లారు.. అక్కడే ఉన్న ఎంఐఎం అధినేత, కార్యకర్తల చేతిలో దెబ్బలు తిన్నారు.. ఎంఐఎం కార్యకర్తలు పిడిగుద్దులు గుద్దుతున్న కనీసం పోలీసులు కూడా రాకపోవడం విస్మయం కలిగించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *