
హైదరాబాద్, ప్రతినిధి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘గోపాల గోపాల’ ఆడియో ఫంక్షన్ లో పాస్ ల విషయమై శ్రీనివాస్ అనే వ్యక్తిని కొందరు దుండగులు వచ్చి కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే.. ఘటనలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.
కాగా శ్రీనివాస్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ లో పరామర్శించారు. ఉదయం 11 గంటలకు వాళ్లను కలిసిన పవన్ దాదాపు గంట పాటు గడిపారు. శ్రీనివాస్ ఫ్యామిలీతో పవర్ స్టార్ మాట్లాడారు. చిన్న పిల్లలను ఎత్తుకొని కాసేపు వాళ్లతో ఆడుకున్నారు. అతని ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చులతో పాటు రూ.50వేల సాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అందించారు.