
కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా కుటుంబాలకు మేలే చేస్తాయి.. దూరమైన మనసుల్ని బంధాల్ని ఇలా దగ్గర చేస్తాయి.. ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్నే 5 గంటలకు నిద్ర లేచి పరుగున వెళ్లే జీవితంలో కుటుంబంతో గడిపే క్షణాలు తక్కువే.. అందుకే మనకు మన వాళ్ల విలువ, అనుబంధాలు తెలియవు.. అలా తెలియాలంటే మనకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడే తెలుస్తుంది..
ఆనుకోని ప్రమాదం కాలు గాయం చేసింది.. దాంతో 15 రోజుల పాటు కట్టు కట్టుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి.. ఇన్నాళ్లు ఉదయం 5 ఇంటికే పోయి పనులు చూసుకొని రెండు మూడు రోజులు ఇంటికి దూరంగా ఉండే వారు.. కానీ ఇప్పుడు బస్సు చేసిన గాయంతో ఇంటికి పరిమితమయ్యాడు.. ఇంకేముంది బంధువుల పరామర్శలు, ఆత్మీయుల స్పర్శలు, నాయకుల తోడ్పాటు లు వెల్లువెత్తాయి..
ఉరుకుల పరుగుల వీరుడు.. గాయం చేసిన మేలుతో 15 రోజులు విశ్రాంతితో ఇంట్లో ఉంటే ఏ కుటుంబానికైనా ఆనందమే కదా.. అందుకే అంటారు ఏదైనా మన మంచికే అయ్యింది.. ఎవరి ప్రేమ ఏంటో ఇప్పుడే తెలిసేది… చిక్కడు దొరకడు కాస్తా పక్షం రోజుల ఇంటిపట్టునే ఉండే కనులవిందు చేస్తున్నాడు..
గాయం మంచే చేసింది.. ఆత్మీయతను పరిచయం చేసింది.. బంధాలను ధృఢత్వం చేసింది.. ఈ కష్టాన్ని భవిష్యత్తుకు గుణపాఠంలా అందజేసింది.. కుటుంబ సభ్యుల కర్తవ్యాన్ని గుర్తు చేసింది..
మరక మంచిదే..