
తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడి స్వైన్ ఫ్లూ సోకినట్లు లక్షణాలు కనపడడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆ యువకుడికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు.
కాగా గాంధీలో స్వైన్ ఫ్లూ సోకడంతో అక్కడ సిబ్బంది, వైద్యులు హడలిపోతున్నారు. చలికాలం రాకముందే ఇలా ప్రబలితే మున్ముందు పరిస్థితి తీవ్ర మవుతుందని.. అందరికీ సోకుతుందేమోనని భయపడుతున్నారు.