
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిన్న కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. . . తెలంగాణ ఏసీబీ అరెస్ట్ లకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో ప్రతీగా ఏపీ పోలీసులను రంగంలోకి దించారు చంద్రబాబు. ఏపీ మంత్రులు, సీఎంకు ఏపీ పోలీసులను విజయవాడనుంచి తీసుకొచ్చి ఇక్కడ భద్రత కల్పించారు. దీంతో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
కాగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ ఏపీ పోలీసులను హైదరాబాద్ నుంచి రీకాల్ చేయాలని ప్రశాంతంగా ఉన్న శాంతి భద్రతలను చెడగొట్టవద్దని ఏపీ డీజీపీని ఆదేశించారు. దీంతో ఏపీ డీజీపీ రాముడు ఈ ఉదయం 400 ఏపీ పోలీసులను హైదరాబాద్ నుంచి రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించారు.