
హైదరాబాద్ : ఏపీ వైసీపీ నేత జగన్ సోమవారం గవర్నర్ నరసింహన్ తో భేటి అయ్యారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య, మాజీ ఎమ్మెల్యే గుర్నాత్ రెడ్డి అరెస్ట్ లపై జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని విన్నవిచంచారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే హత్యలు జరుగుతున్నాయని పోలీసులు ఇందులో భాగస్వాములవుతున్నారని ఆరోపించారు.