
హైదరబాద్, ప్రతినిధి : 2014 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పద్దులు, లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ లెక్కల్ని కాగ్ గవర్నర్ కు అందజేసింది. సామాన్య సామాజిక రంగాల పై భారత్ కంప్ట్రోలరు ఆడిట్ జనరల్ తన నివేదికను తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టం 2014లోని 45(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర శాసన సభలలో ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెడతాయి. భారత రాజ్యాంగము 151 అధికరణాన్ని అనుసరించి కాగ్ ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వ పద్దులపై నివేదిక సమర్పించాల్సి వుంటుంది. ఈ నివేదిక గవర్నర్ ఆయా రాష్ట్ర శాసన సభలలో ప్రవేశ పెడతారు.