గర్శకుర్తి లో బతుకమ్మ చీరల తయారీ యునిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే: సుంకె రవిశంకర్

నేతన్న జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

గర్శకుర్తి లో బతుకమ్మ చీరల తయారీ యునిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఉన్న ఊరిలో ఉపాధి కరువై పొట్ట చేతబట్టుకొని ముంబాయి, భీవండి పట్టణాలకు వలసపోయి అష్టకష్టాలు అనుభవించిన నేతన్నలను ఉమ్మడి పాలనలో చూసాము. చేసిన పనికి కనీస వేతనం లభించక, కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేక భార్యపిల్లలను పస్తులు ఉంచలేక నేతన్నల ఆకలి చావులను చూసాము. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేసారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రములోని ఆడపడుచులకు పంపిణీ చేయడానికి బతుకమ్మ చీరలను తయారు చేయడానికి ప్రభుత్వం నేత కార్మికులకు అవకాశం ఇచ్చింది.

బతుకమ్మ చీరలు తయారు చేయడానికి ఇప్పటి వరకు 260 కోట్ల రూపాయలు ఖర్చు చేదింది.

సిరిసిల్ల తరహాలో గంగాధర మండలం గర్శకుర్తిలోని నేత కార్మికులకు బతుక్మయ చీరల తయారీకి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ద్వారా ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళి అవకాశం ఇప్పించాము.

50 ఏళ్లు నిండిన ప్రతి నేత కార్మికునికి పెన్షన్ ప్రభుత్వం అందజేస్తోంది.

బతుకమ్మ చీరలే కాకుండా రంజాన్, క్రిస్టమస్ పండుగలకు ప్రభుత్వం పంపిణీ చేసే చీరల తయారీకి , ఆర్వీయం దుస్తుల తయారీకి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. గతంలో నేత కార్మికులకు నెలకు 5 వేల నుండి 6 వేల వరకు మాత్రమే వచ్చేంది, ముఖ్యమంత్రి ప్రవేశ పెట్డిన పలు సంస్కరణ తో ప్రస్తుతం 15 వేల నుండి 20 వేల వరకు పొందుతున్నారు.

గర్శకుర్తి కి సిరిసిల్ల తరహా ప్యాకేజీ వర్తింపజేయడానికి కృషి చేస్తాను.

ఇక్కడ పనిచేసే నేత కార్మికులతో పాటు, మండలం లోని వివిధ గ్రామాల్లోని నేతకార్మికుల అభివృద్ధి కి సహకారం అందజేస్తాను.

sunke ravi shanker 1     sunke ravi shanker 2     sunke ravi shanker 3     sunke ravi shanker 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *