
కరీంనగర్ లో నిన్న చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డ ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. తారా వారెవరని ఆరా తీస్తే పోలీసులకు దిమ్మదిరిగే షాక్ తగలింది. వారు ముగ్గురు విద్యార్థులట.. ముగ్గురు గర్ల్ ప్రెండ్స్ ను కలిగియున్నారట. వారిని జల్సాలకు తిప్పడం కోసం ఇలా చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారట..
కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన నేదునూరి శ్రావణ్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలివాడకు చెందిన తొంగరి రాము, పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన బొకరి సునీల్ రాజ్ లు దొంగల ముఠాగా ఏర్పడి కరీంనగరంతో పాటు జిల్లాలోని ఒంటరిగా సంచరించే మహిళల మెడలోని గొలుసులను దొంగిలించేవారు. ఇలా నే విద్యానగర్ లో దొంగతనానికి పాల్పడగా పోలీసులు పట్టుకున్నారు. విచారిస్తే వారి బండారం బయటపడింది..