గర్జన సభకు వేలాదిగా తరలి వస్తున్న జర్నలిస్టులు: నగునూరి శేఖర్

 

వివిధ సమస్యల సాధనకోసం ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన జర్నలిస్టుల గర్జన సభకు రాష్ట్రం నుండి వేలాది మంది జర్నలిస్టులు తరలివస్తున్నట్లు టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్ అన్నారు. మంగళవారం బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో గర్జన ఏర్పాట్లపై యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్జన సభను విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో జర్నలిస్టులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారన్నారు.7నుండి 8వేల మంది జర్నలిస్టులు గర్జన కు తరలివచ్చే అవకాశం ఉందని శేఖర్ ధీమా వ్యక్తం చేశారు. టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ మాట్లాడుతూ గర్జన సభలో పాల్గొనే జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఉండేందుకు గాను సంతృప్తికరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.జిల్లాల నుండి వచ్చే వాహనాలకు పార్కింగ్ కోసం కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. సభకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నందున ఆర్టీసీ కళా భవన్ తో పాటు అదే ప్రాంగణంలో గల కల్యాణ మండపంలో సైతం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా ఆప్రాంగణంలో ఎల్ ఈ డి లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.సభ నిర్వాహణలో భాగంగా హైదరాబాద్, మేడ్చెల్,రంగారెడ్డి జిల్లాల జర్నలిస్టులకు ఆయా కమిటీల భాద్యతలు అప్పగిస్తున్నట్లు విరాహత్ వివరించారు. ఈ సమావేశానికి హెచ్ యూ జె కార్యాదర్శి శంకర్ గౌడ్ అధ్యక్షత వహించగా ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి,ఐజేయూ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ,టీయూడబ్ల్యూజే కోశాధికారి మహిపాల్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి, కిరణ్ కుమార్,వెల్జాల చంద్రశేఖర్,ఆర్యన్ శ్రీనివాస్ ,రాజేష్,హెచ్ యూ జే అధ్యక్షులు రియాజ్ అహ్మద్, మేడ్చెల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ రెడ్డి,బాలరాజు,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బాల కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

*పోస్టర్ ఆవిష్కరణ*
జర్నలిస్టుల గర్జనకు సంబంధించిన వాల్ పోస్టర్ గ్రేటర్ హైదరాబాద్ యూనియన్ ముఖ్యుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *