గరీబోల్ల ఇండ్లు అని తెలువకుండా కట్టండి..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ప్రభుత్వం తలపెట్టిన లక్ష ఇండ్ల నిర్మాణం కార్యక్రమ అమలు పురోగతిపై సీఎం కే. చంద్రశేఖర్ రావు సమీక్ష జరిపారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావుతో చర్చించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో రాజేంద్రనగర్ , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, వివేకానందలు పాల్గొని కేసీఆర్ కు విన్నవించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి పురోగతిని వివరించిన కలెక్టర్ ఇప్పటివరకు అందిన దరఖాస్తులను సేకరించిన స్థలాల గురించి చెప్పారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ నివాసయోగ్యమైన చక్కటి స్థలాలను గుర్తించండి.. టవర్లను అందంగా నిర్మించండి.. ఎవరైనా వస్తే ఇవి గరీబోల్ల ఇండ్లు కావు ధనికులవి అనేట్టు ఉండాలి అని కేసీఆర్ అధికారులకు సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *