
ప్రపంచకప్ లో మరో పరుగుల సునామీ వచ్చింది. వెస్టిండీస్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పరుగుల వరద పారించింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మార్టిన్ గప్టిల్ (152 బంతుల్లో 203 పరుగులు) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రపంచ క్రికెట్ లో డబుల్ సెంచరీలు చేసిన వారిలో ఐదవ బ్యాట్స్ మెన్ మార్టిన్ గప్టిల్. అంతకుముందు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, రోహిత్, గేల్ లు డబుల్ సెంచరీలు సాధించారు.
కాగా మార్టిన్ గప్టిల్ 4 పరుగులు ఉన్న సమయంలో ఇచ్చిన క్యాచ్ ను సామ్యూల్స్ జార విడిచి అతిపెద్ద తప్పు చేశాడు. అప్పుడు పట్టి ఉంటే గప్టిల్ డబుల్ సెంచరీ చేసేవాడే కాదు. మొత్తానికి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వెస్టిండీస్ బౌలర్లను చితకబాది 50 ఓవర్లలో 393/6 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది.