గద్దర్ పోటీచేస్తే టీఆర్ఎస్ పని ఖతమే..

వరంగల్ ఎంపీ స్థానం కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయ్యింది.. దీంతో రాబోయే మూడు నెలల్లో నోటీఫికేషన్ జారీ కానుంది.. ఈ నేపథ్యంలో పార్టీల దృష్టి అంతా వరంగల్ ఉప ఎన్నికపై పడింది.. టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. కాంగ్రెస్ , టీడీపీ, బీజేపీలు కూడా వరంగల్ స్థానాన్ని టీఆర్ఎస్ నుంచి చేజిక్కించుకోవాలని వ్యూహాలు పన్నుతున్నాయి.

టీఆర్ఎస్ నుంచి కడియం కూతురు?

కాగా అధికార పార్టీ స్థానం కావడం.. కడియం రాజీనామా చేయడంతో ఆయన కూతురినే ఇక్కడి నుంచి పోటీచేయించాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది.. కడియం కూతురు కాకుంటే .. కేయూ ప్రొఫెసర్ ఒకాయన టీఆర్ఎస్ లైన్లో ఉన్నారు. వారు కాకుంటే టీఆర్ఎస్ ఎస్టీ వింగ్ విద్యార్థి నేత పేరు కూడా వినిపిస్తోంది..

కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రజాసంఘాల ఉమ్మడి  అభ్యర్థిగా గద్దర్..

వరంగల్ లో టీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుత ఐడియాకు శ్రీకారం చుడుతోంది.. అది అమలైతే వరంగల్ లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమే.. వరంగల్ ఎంపీ నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రజాసంఘాలు ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణ పోరాట యోధుడు గద్దర్ ను నిలపాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి యోచిస్తున్నారు. ఇవాళ గాంధీభవన్ లో జరిగే కాంగ్రెస్ సమన్వయ సమావేశంలో అందరితో చర్చించి గద్దర్ పేరును ప్రతిపాదించనున్నట్టు తెలిసింది..

పోటీకి గద్దర్ నిరాసక్తత.?

కాగా వరంగల్ నుంచి కాంగ్రెస్, ప్రజాసంఘాలు, కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయడానికి గద్దర్ విముఖత చూపిస్తున్నట్టు సమాచారం. ఆయన ను ఎలాగైనా ఒప్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారట.. ఎలాగైనా వరంగల్ లో టీఆర్ఎస్ ను ఓడించాలని అందుకు తెలంగాణ పోరాట యోధుడు గద్దర్ పోటీలో నిలపడమే మంచిదని యోచిస్తున్నారట.. గద్దర్ నిలబడితే టీఆర్ఎస్ తో పాటు అందరికి డిపాజిట్లు దక్కవని ఉత్తమ్ స్పష్టం చేశారట.. అందుకే ఇప్పుడు గద్దర్ ను పోటీ చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.