Breaking News

గతంలో మమ్మల్ని గుంజుల్నికదా..

HARISH-3_0_0_0_0

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా చేర్చుకుంటున్నారని పెడబొబ్బలు పెడుతున్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో మీరు అధికారంలో ఉండగా టీఆర్ఎస్ చీల్చలేదా.. మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకోలేదా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన హరీష్ ఈ సందర్భంగా జానా, ఉత్తమ్ ల ఏడుపు అప్పుడే ఉంటే ఇప్పుడు మీకు ఈ కర్మ తప్పేది కదా అని ప్రశ్నించారు.

అధికారంలో ఉండగా మీరు చేసింది ఒప్పు అయితే మేం చేసింది కూడా ఒప్పేనని హరీష్ అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ది చూసే నేతలందరూ బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నారని.. ఎవరిని బలవంతంగా చేర్చుకోవడం లేదని హరీష్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు హరిష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *