Breaking News

గడ్డం పెంచిన మేధావుల మాటలు అర్థం కావా.?

pavab

మేధావులంటే అంతే.. భారీ గడ్డం.. వ్యూహాత్మక మౌనం… చూడ్డానికి పిచ్చొళ్లలా ఉంటారు.. ఊరికే మాట్లాడరు.. మాట్లాడితే అర్థం కాదు.. సైంటిస్టులు, బాగా చదువుకున్న వాళ్లు కూడా ఇలానే గడ్డాలు, మీసాలు పెంచేసి ఏదో ఏదో చేస్తుంటారు. కానీ మన పవన్ కళ్యాన్ మాత్రం మేధావుల్లో మేధావని అనుకుంటున్నారు. ఆయన మీడియా ముందు మాట్లాడిన భాష మాత్రం ఆయనకు అర్థం కాలేదు.. విలేకరులకు అర్థం కాలేదు.. నేను మాట్లాడింది మాట్లాడాను.. మీకు నచ్చిన విధంగా అన్వయించుకొని రాసుకోండి అంటూ చివర్లో జలక్ ఇచ్చారు పవన్..

రేవంత్ విషయంలో స్పందింస్తానన్నారు. అది కోర్టు తేలుస్తుందని తప్పించుకున్నారు. కేసీఆర్ హ్యూమనిస్ట్ అన్నారు. మరి ఆంధ్రోళ్లని ఎందుకు తిడుతున్నవ్ అంటూ మండిపడ్డారు. సెక్షన్ 8 అమలు చేయద్దొన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీబీఐ విచారణ జరపాలని ఆంధ్రా బాబు పాట పాడారు..

ఏం మాట్లాడాలో ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక తికమక పడ్డారు. అటు తిప్పి ఇటు తిప్పి.. ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లి మేధావుల భాష అర్థం కాదు అన్న రితీలో తాను ఒక మేధావేనా అన్నట్లు మాట్లాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *