
హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 15 కార్లు దెబ్బతిన్నాయి. గచ్చిబౌలి నుంచి విప్రో జంక్షన్ వైపు వెళుతున్న టిప్పర్‌కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది.
ఆ కారు.. దానికి ముందున్న మరో కారుని ఢీకొట్టింది. ఇలా 15 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఆ వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో దాదాపు 10 కార్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు ఈ టిప్పర్.. విప్రో కంపెనీ ప్రహరీని ఢీకొని ఆగిపోవడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు.