గంధమల్ల పరిసరాల్లో 40 వేల ఎకరాలకు ఖరీఫ్ లో సాగునీరు. -మంత్రి హరీష్ రావు.

గంధమల్ల పరిసరాల్లో 40 వేల ఎకరాలకు ఖరీఫ్ లో సాగునీరు.  -మంత్రి హరీష్ రావు.

గంధమల్ల, బస్వాపూర్ లను వేగవంతం చేయాలి.

వచ్చే వానాకాలానికి యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం జలాలు.

వచ్చే వానాకాలం నాటికి కరవుపీడిత యాదాద్రి భువనగిరి జిల్లాకు కాళేశ్వరం జలాలు అందుతాయని ఇరిగేషన్  మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇందుకు గాను గంధమల్ల,బస్వాపూర్ రిజర్వాయర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికార యంత్రాంగాన్ని, ఏజెన్సీలను ఆదేశించారు.గురువారం నాడీక్కడ జలసౌధలో యాదాద్రి జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ 15,16 పనులను మంత్రి సమీక్షించారు.గంధమల్ల రిజర్వాయర్ పూర్తికాక పోయినా డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు డిస్ట్రిబ్యూటరీలను పూర్తిచేస్తే వాటి ద్వారా 100 చెరువులు నింపి  యాదాద్రి జిల్లాలోని గంధమల్ల ప్రాంతంలో కనీసం 21 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చునని మంత్రి చెప్పారు. ఇంకా కృషి చేస్తే దాదాపు 40 వేల ఎకరాలకు కూడా సాగునీరిచ్చే అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.ఈ డిస్ట్రిబ్యూటరీల కోసం భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి  చేయాలన్నారు.వారం, పది రోజుల్లో భూసేకరణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.వచ్చే మూడు నెలల్లో డిస్ట్రిబ్యూటరీల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.

harish rao 1

స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గంధమల్ల రిజర్వాయర్ పనులకన్నా డిస్ట్రిబ్యూటరీల పనులపై దృష్టి కేంద్రీకరించాలని ఇరిగేషన్ అధికారులను హరీష్ రావు కోరారు.గంధమల్ల చుట్టుపక్కల ఎన్ని గొలుసుకట్టు చెరువులున్నాయి?ఎంత ఆయకట్టుకు సాగు నీటిని  అందించవచ్చునో ఇరిగేషన్ సిబ్బంది వెంటనే వివరాలు ఇవ్వాలని సూచించారు.మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల వరకు 35 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వకం జరగవలసి ఉన్నది.ఈ ప్రధాన కాలువ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.ఇందులో 20 కిలోమీటర్లు సిద్ధిపేట జిల్లా పరిధిలో ఉండగా మరో 15 కిలోమీటర్లు యాదాద్రీభువనగిరిజిల్లాలో ఉన్నాయి.మల్లన్న సాగర్, గంధమల్ల మధ్య త్వరలో తాను పర్యటిస్తానని హరీష్ రావు చెప్పారు. కాలువ కట్ట పనుల పురోగతిని పరిశీలిస్తానని ఆయన తెలిపారు. కెనాల్ వెంట క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని చెప్పారు.బస్వాపూర్ దగ్గర ప్యాకేజీ 16 లో ప్రధాన కాలువ,డిస్ట్రిబ్యూటరీల పనులు వేగవంతం చేయాలని మంత్రి కోరారు.ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి,ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఇరిగేషన్ ఈ.ఎన్ సి.మురళీధర్ రావు,కాళేశ్వరం సి.ఈ.హరి రామ్ తదితరులు పాల్గొన్నారు.

harish rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *