
నరేంద్ర మోడీ ప్రభుత్వం విమానయాన రంగంలో కొత్త మార్పును తీసుకొచ్చింది. దేశంలో చిన్న నగరాలు, సరికొత్త మార్గాల్లో విమానాలు గంట ప్రయాణించే చార్జి 2500 మాత్రమే ఉండాలన్న నిబంధన ను కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది..
విమాన ప్రయాణాన్ని మధ్య తరగతి ప్రజలకూ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పౌర విమానయాన నూతన విధాన ముసాయిదాను ప్రభుత్వం తెచ్చింది.
అంతేకాదు విమానయాన సంస్థలు, విమానాల మరమ్మతు, నిర్వహణ సేవలకు పన్ను మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల విమాన నిర్వహణ ఖర్చు తగ్గి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.