గంగాధర మండలవాసుల గోస..

001

తలాపునే నీరున్నా తాగేందుకు నీరు లేని చందంగా మారింది గంగాధర మండల వాసుల పరిస్థితి..  ఈ మండలం కరీంనగరానికి ఆనుకొని ఉంటుంది.. కానీ జిల్లాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడుతున్న సిరిసిల్ల జిల్లాలో దీన్ని కలుపుతున్నారు. ఎందుకంటే అసలు సిరిసిల్ల జిల్లా మొదట సోదిలోనే లేదు. కేటీఆర్ కోరిక, స్థానికుల డిమాండ్ మేరకు కొత్తగా పుట్టుకొచ్చింది.

దీంతో సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం కరీంనగర్ కు ఆనుకొని ఉన్న గంగాధర మండలాన్ని ఇష్టం లేకున్నా కలపాల్సి వస్తోంది. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గంగాధర మండలవాసులు సిరిసిల్లలో తమను కలుపవద్దంటూ నెలరోజులుగా ఆందోళన చేస్తున్నారు. పాదయాత్రలు, ధర్నాలు, రాస్తోరోకోలతో హడలెత్తిస్తున్నారు. కొందరు టీడీపీ నాయకులు సిరిసిల్లకు పాదయాత్ర కూడా చేస్తున్నారు. పొరుగునే ఉన్న కరీంనగర్ జిల్లాలోనే తమను కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వీరి గోస ఆలకించే నాథుడే లేకుండా పోయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *