Breaking News

ఖరీఫ్ లో విత్తన ఉత్పత్తి సరఫరాపై సమీక్షా సమావేశం

ఖరీఫ్ లో విత్తన ఉత్పత్తి సరఫరాపై సమీక్షా సమావేశం

ఈ ఖరీఫ్ పంట కాలంలో రాష్ట్రంలో విత్తన లభ్యత, సరఫరాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సి. పార్థసారధి, IAS, గారు ఈ రోజు అనగా గురువారం నాడు సచివాలయంలోని తన చాంబర్లో వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ మరియు విత్తన ధృవీకరణ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఇప్పటి వరకు మూడు (3) లక్షల క్వింటాలకుపైగా విత్తన సరఫరా చేయటం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ విత్తనోత్పత్తి పథకం జిల్లాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలు మరియు సాధించిన ప్రగతిపై సమీక్షించి, విత్తన ధృవీకరణ లక్ష్యాలను సాధించాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ యొక్క పంటల వారిగా విత్తనోత్పత్తి విస్తీర్ణ లక్ష్యాలను మరియు ప్రగతిని సమీక్షిస్తూ సంస్థ ద్వారా రైతులకు సబ్సిడీ పై సెర్టిఫీడ్ విత్తనాలను పంపిణిచేయాలని ఆదేశించారు. ఈ సంస్థ ఈ ఖరీఫ్ లో 33,000 ఎకరాలలో విత్తనోత్పత్తి చేపట్టనున్నది.

ఈ సమావేశంలో విత్తన సేంద్రీయ ధృవీకరణ సంస్థ సంచాలకులు డాII కే.కేశవులు, డిప్యూటీ డైరెక్టర్లు – జి.సుదర్శన్, రవీందర్ రెడ్డి, భాస్కర్ సింగ్, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివప్రసాద్, విత్తనాభివృద్ధి సంస్థ మేనేజెర్లు వేంకటేశ్వర రావు, సదానందం తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *