
కరీంనగర్: జిల్లాలోని రైతులు పత్తికి బదులుగా సోయాబీన్, పప్పు దినుసులు సాగు చేయాలని రాష్ట్ర్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం మంత్రి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర్రంలో రైతులు ఖరీఫ్ లో పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్, పప్పు దినుసులను సాగు చేయాలని కోరారు. వ్యవసాయ సంఘాల ద్వారా విత్తనాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర్ర ముఖ్యమంత్రి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సోయాబిన్, పప్పు దినుసుల విత్తనాలను గత సంవత్సరం రేటుకే సరఫరా చేయనున్నామని తెలిపారు. ప్రతి ప్రాధమిక సహకార సంఘం రైతులకు రుణాలను పంపిణి చేయడంతో పాటు నాన్ క్రెడిట్ అంశమైన విత్తనాలను, ఎరువులను తప్పనిసరిగా సరఫరా చేయాలని అన్నారు. పత్తి పంట ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనందున పత్తి పంటకు రేటు పెరిగే అవకాశం ఉండదని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఇతర పంటలపై సాగు చేయాలని కోరారు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడుతాయని వాతావరణ శాస్త్ర్రజ్ఞులు తెలుపుచున్నందున ఖరీఫ్ లో డిమాండు అనుసరించి విత్తనాలను సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లా అధికారులు తమకు ఎంత ఎరువు, విత్తనాలు అవసరమో ఇండెంటును రాష్ట్ర్ర విత్తన అభివృద్ధి సంస్ధ పంపాలని కోరారు. వారి డిమాండ్ అనుసరించి విత్తనాలను సరఫరా చేస్తామని తెలిపారు. ప్రతి సహకార సంఘానికి ఖరీఫ్ లో సమన్వయం పరచడానికి ఒక వ్యవసాయ అధికారిని, ఒక సహకార సంఘం అధికారిని నియమించినట్లు తెలిపారు. మే 15 లోపల గ్రీన్ మెన్యువల్ (పచ్చి రొట్ట విత్తనాలు) విత్తనాలను సమృద్ధిగా సరఫరా చేస్తామని
తెలిపారు. రైతులు ప్త్ర్రెవేటు వ్యాపారుల బరినపడకుండ ఉండటానికి ప్రాధమిక వ్యవసాయ సంఘాల ద్వారా విత్తనాలను, ఎరువులను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రాధమిక వ్యవసాయ సంఘంలోనే విత్తనాలకు, ఎరువులకు పరిమిట్లను ఇస్తారని తెలిపారు. రైతులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అధికారులు ఉదయం నుండే ప్రాధమిక వ్యవసాయ సంఘాలలోనే ఉండి రైతులకు పర్మిట్లును ఇవ్వాలని తెలిపారు. కరీంనగర్ జిల్లాకు రాయితీతో కూడిన వరినారును సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలో ఉన్న సీడ్ ఫాంలను విత్తన
అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం పప్పు దినుసులు విత్తనాలను గత సంవత్సరం ధరలకే సరఫరా చేస్తుందని అన్నారు. జిల్లాలో విత్తనాలకు కొరత లేదని తెలిపారు. ప్రాధమిక వ్యవపాయ కేంద్రాల ద్వారా విత్తనాలను సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్ధసారధి, అధికారులు, జిల్లాలో వ్యవసాయ శాఖ జె.డి. విత్తనాభివృద్ధి సంస్ధ ఎం.డి. మురళి ఇతర అధికారులు పాల్గొన్నారు.