
క్షయ వ్యాధిగ్రస్తులకి ప్రతి రోజూ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎర్రగడ్డ లోని టీబీ శిక్షణ సెంటర్ లో జ్యోతి
వెలిగించి ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
గతంలో రోజు విడిచి రోజు ఇచ్చే మందులను ఈ రోజు నుంచి ప్రతిరోజూ పంపిణీ చేస్తారు 2025 నాటికి దేశంలో టీబీ ని పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం*మంత్రి లక్ష్మారెడ్డి*
ప్రపంచ వ్యాప్తంగా జబ్బుల పట్ల అలర్ట్ గా ఉన్న రాష్ట్రం తెలంగాణ who, కేంద్రం ఏ కొత్త పథకం తెచ్చినా వాటి అమలులో తెలంగాణ రాష్ట్రం ముందుంది MR వ్యాక్సిన్ వేయడంలో వంద శాతం సక్సెస్ అయ్యామన్నారు. 2030 నాటికీ టీబీ నివారించాలని who భావిస్తున్నది 2025 నాటికి దేశంలో టీబీ ని లేకుండా చేస్తామని కేంద్రం చెబుతున్నదన్నారు. 2023 నాటికే, తెలంగాణ లో టీబీ లేకుండా చేద్దాం ఇందుకు అందరూ సహకరించాలని హెల్త్ కి సంబందించిన అన్ని సౌకర్యాలు సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. చెస్ట్ హాస్పిటల్లో రెండు మెడిసిన్ ,రెండు సర్జన్ విభాగాలను తీసుకువస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్ కిలారి మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, వైద్య సంచాలకులు లలితకుమారి, రాష్ట్ర ima అధ్యక్షుడు నర్సింగా రెడ్డి, డా. సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.