క్షమాగుణ దినోత్సవం

తనపై గురి చూసి రాయిని విసిరేవారికి.. ప్రేమతో పండును ప్రసాదించే వృక్షం క్షమాపణకు నిలువెత్తు సాక్ష్యం. మన్నించే మనసే సామరస్యతకు సోపానం. అన్న సత్యం తెలిస్తే… ద్వేషానికి తావులేని సుఖమయ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. బంధువులైనా. జీవిత భాగస్వాములైనా.. స్నేహితులైనా.. సొంత సంతానమైనా సహోదరులైనా. మరింత సన్నిహితులైనా అందరి మధ్య అనురాగాన్ని పండించే గుణం ప్రేమ అయితే..
దానిని ఎప్పటికీ నిలిపి ఉంచే లక్షణం క్షమాగుణం. ఈ ‘క్షమాగుణ దినోత్సవాన్ని’ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
*మానసిక ప్రశాంతత..*
క్షమాపణ చెప్పడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. క్షమాపణ చెప్పేవారిలో మానసిక పరిపక్వత చెందిన వారిగా భావించొచ్చు. క్షమాపణతో అవతలి వారిలో అపరాథ భావం తొలగిపోతోంది. తద్వారా ఆందోళన పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది.
*ఒత్తిడికి దివ్య ఔషధం*
క్షమాపణ మానసిక ఒత్తిడికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. క్షమాగుణం కలిగిన వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరికి శత్రువులు సైతం తక్కువగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులను మహోన్నతి వ్యక్తులగా చెప్పొచ్చు.
*క్షమాపణతో మనస్పర్థలు తొలగి పోతాయి*
స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తోబుట్టువుల మధ్య చిన్నచిన్న తగాదాలు ఏర్పడతాయి. కొన్ని వెంటనే సమసిపోతే మరికొంతమంది మాత్రం కొన్నేళ్లపాటు మొహం చాటేస్తారు. వారి మధ్య మనస్పర్థలు ఒకరంటే ఒకరికి గిట్టని స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఒక్కరూ క్షమాపణ చెప్పేందుకు ముందుకు వస్తే సమస్యలు తొలగి పోతాయి.
? అందరూ క్షమా గుణాన్ని అలవరచుకుంటే మంచిది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *