క్షణికావేశంతో కుటుంబం బలి

-భార్య, కొడుకు చంపి, ఆత్మహత్య చేసుకున్న భర్త

భైంసా : క్షణికావేశం ఓ కుటుంబాన్ని బలి చేసింది. తాగివచ్చిన భర్త అర్ధరాత్రి  భార్యతో గొడవపెట్టుకున్నాడు.  గొడవ ముదిరి భర్తను పిచ్చివాణ్ని చేసింది. అక్కడ ఉన్న గొడ్డలితో భార్యను, కొడుకు ను కడతేర్చాడు. చివరకు అతడు పురుగుల మందుతాగి ఆత్మహత్యచేసుకున్నారు. ఈ దారుణ ఘటనలో భార్య, భర్త, కుమారుడు ముగ్గురు చనిపోవడం విషాదం నింపింది.

ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ దేవ్ పటేల్ అనే వ్యక్తి అర్ధరాత్రి భార్య సుమతిబాయితో గొడవపడి ఆమెను, కొడుకును గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.  కాగా వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన కూతురు సోని ఈ దారుణ ఘతుకానికి బలికాకుండా తప్పించుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *