క్రైస్తవ మతపెద్ద.. పక్కా ముస్లిం దేశానికి..

pope-story_647_012216050148-1_647_030316105355

ఆయన క్రైస్తవ మతానికి పెద్ద గురువు.. ఆయన్ను పోప్ అంటారు.  వాటికన్ సిటీలో ఉండే పోప్ ఫ్రాన్సిస్ క్రైస్తవ మతానికి ఆది పరుషుడు లాంటి వాడు.. అలాంటి మతగురువు ఇప్పుడు పక్కా ముస్లిం చాందసవాద దేశమైన పాకిస్తాన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోప్ ఫ్రాన్సిస్ ను తమ దేశంలో పర్యటించాలని ఏకంగా పాక్ ప్రధాని ఆహ్వానం పంపారు.  అంతేకాదు పాక్ ప్రభుత్వంలోని క్రైస్తవ మంత్రిని పోప్ ను ఆహ్వానించడానికి వాటికన్ సిటీకి కూడా పంపారు.

దీంతో పాక్ ప్రధాని ఆహ్వానం మేరకు పోప్ పాకిస్తాన్ లో పర్యటించనున్నారు. దీంతో పాకిస్తాన్ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రపంచంలోని మతచాంధసవాదం ఎక్కువగా ఉన్న పాక్ లో క్రైస్తవ మత గురువు పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన రాకపై ముస్లిం మత పెద్దలు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో పాకిస్తాన్ లో ఆయన భద్రత పర్యటన ఉద్రిక్తంగా మారుతోంది. ఏం జరుగుతందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *