Breaking News

క్రేజ్ తెచ్చుకున్న ‘చోటా భీమ్’

చోటా భీమ్.. పొగో చానల్ లో వస్తున్న ఈ ప్రొగ్రాం తెలియని పిల్లలుండరు. భీమ్ ను అనుసరించని వారుండరు.. చోటా బీమ్ జాన పద కథలుగా కార్టూన్ బొమ్మలతో రూపొందే ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఇండియాలో ఫేమస్ గా మారింది. పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు పిల్లల వస్తువులపైన దీన్ని విరివిగా వాడుతున్నారు. బీమ్ పిల్లల్లో ఒక హీరో అయి కూర్చున్నాడు..

చోటా భీం ఏం చేస్తాడు.?
చోటా భీం పేరు మీద పొగో చానల్ లో వచ్చే సీరియల్ లో చోటా భీం తో పాటు అతని మిత్రద్వయం ఒక అడవికి ఆనుకుని ఉండే గ్రామంలో నివసిస్తారు. ఆ గ్రామాన్ని ఒక రాజు పరిపాలిస్తాడు. గ్రామానికి వచ్చే ఆపదలు, రాజ్యంలో చెలరేగే అలజడులు, రాక్షసులతో యుద్ధాలు, జంతువులు.. ఇలా మహాభారతం యుగంలో చోటుచేసుకున్న కథాంశాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకే ప్రొగ్రాం వస్తుందంటే చాలు పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇప్పుడీ చోటా భీం ప్రొగ్రాం  దేశంలోనే పిల్లలు ఎక్కువగా చూసే అత్యధిక వ్యూయర్ షిప్ కలిగిన ప్రొగ్రాంగా నిలిచింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *