
*గిరిజన క్రీడాకారున్ని అభినందించిన బుర్రా వెంకటేశం.
శ్రీలంక రాజధాని కొలంబో లో జరిగిన 3వ స్టూడెంట్స్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ లో నాగర్ కర్నూలు జిల్లా పదర
మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి తిరుపతి నాయక్ జూడో క్రీడల విభాగంలో పాల్గొని గోల్డ్
మెడల్ సాధించినందుకు తెలంగాణ టూరిజం, క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ అభినందించారు. తెలంగాణ
రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ లో పథకాలు సాధించటమే లక్ష్యంగా సాగాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల
అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ
సందర్భంగా తిరుపతి నాయక్ కు భవిష్యత్ క్రీడ పోటీలలో పాల్గొన టానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని
అదించాలని ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారి విజ్ఞప్తి ని కార్యదర్శి వెంకటేశం గారు సానుకూలంగా స్పందించారు.