క్రిస్మస్ కానుకగా గోపీచంద్, రవికుమార్ చౌదరి, భవ్య క్రియేషన్స్ చిత్రం

‘యజ్ఞం’తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న గోపీచంద్, ఏయస్ రవికుమార్ చౌదర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. భవ్య క్రియేషన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ తో ఈ చిత్రం 70 శాతం పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు.

ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ – ”ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. గోపీచంద్ మార్క్ యాక్షన్, రవికుమార్ చౌదరి మార్క్ ఎమోషన్ కూడా ఉంటాయి. కథ డిమాండ్ మేరకు చిత్రంలో అత్యంత భారీ తారాగణం ఉంటుంది. అనూప్ రూబెన్స్ మంచి పాటలు ఇచ్చారు. మొత్తం ఐదు పాటలుంటాయి. వాటిలో మూడు పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నాం. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.