Breaking News

క్రిస్మస్ కానుకగా గోపీచంద్ `సౌఖ్యం`

2
సౌఖ్యంగా ఉన్నారా? అంటున్నారు గోపీచంద్. నలుగురి క్షేమం కోరే వ్యక్తిగా, నలుగురి సౌఖ్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడని వ్యక్తిగా గోపీచంద్ నటిస్తున్న చిత్రం ‘సౌఖ్యం’.  గోపీచంద్ కెరీర్ ఆరంభంలో ‘యజ్ఞం’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
భవ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి. ఆనంద్‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల స్విట్జర్లాండ్ లో మూడు పాటలు చిత్రీకరించారు.

1
రామజగోయ్య శాస్ర్తి రాసిన ‘ఓనా సిండ్రెల్లా ముద్దొచ్చే ఏంజెల్లా. ఓ మై గాడ్ ఇంతందంగా పుట్టాలా..’, అనే పాటను, ‘నాకేం తోచదే నాకేం తోచదే తోచదే.. తోచదే..’ అనే మరో పాటను, భాస్కరభట్ల రవికుమార్ రాసిన ‘ఆ ఇవ్వమ్మ ఇవ్వమ్మ హని హని స్వీటి..’ అనే పాటను స్విట్జర్లాండ్ లోని అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించారు. మిగతా రెండు పాటల చిత్రీకరణ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. వీటిలో ఒకటి ఐటమ్ సాంగ్. క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా వి.ఆనంద్‌ప్ర‌సాద్ మాట్లాడుతూ –  ”ఎదుటివారి సౌఖ్యం గురించి ఆలోచించేవాళ్లే ఆత్మీయులు. త‌న ఇంట్లో ఉండే వాళ్లు మాత్ర‌మే కాదు, త‌న చుట్టుప‌క్క‌ల‌వాళ్ళు కూడా సౌఖ్యంగా ఉండాల‌నుకునే మంచి మనసున్న వ్యక్తి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆత్మీయుల సౌఖ్యం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడతాడు. ఫైట్స్ మాత్రమే కాదు… ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేయ‌డానికైనా సిద్ధపడిపోతాడు. ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి, గోపీచంద్కాంబినేష‌న్‌ లో రూపొందుతున్న చిత్రం కావడంవల్ల అంచనాలు భారీగా ఉంటాయి.  ఆ అంచనాలను చేరుకునేలా ఈ చిత్రం ఉంటుంది. మ‌నుషుల మ‌ధ్య ఉంటే అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల‌కు పెద్ద పీట వేసిన సినిమా ఇది. అనూప్ రూబెన్స్ మంచి స్వరాలందించారు. యూత్ కీ, కుటుంబ ప్రేక్షకులకూ ఈ పాటలు దగ్గరవుతాయి. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం” అని చెప్పారు.
3
ద‌ర్శ‌కుడు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ – ”ఎదుటివారి క్షేమ‌స‌మాచారాల‌ను క‌నుక్కోవ‌డం మ‌న‌కున్న సంస్కారం. అలాంటి సంస్కారం తెలిసిన యువకుడు త‌న వారి సౌఖ్యం కోసం, త‌న చుట్టూ ఉన్న వారి సౌఖ్యం కోసం యాక్ష‌నే చేశాడా? ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోనే కొన‌సాగాడా? అనేది ఈ సినిమాలో ప్ర‌ధానాంశం. గోపీచంద్‌, రెజీనా జంట చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.  ప‌దేళ్ళ త‌ర్వాత గోపీచంద్‌తో మ‌ర‌లా ప‌నిచేస్తుంటే ఒక‌ర‌క‌మైన ఉత్సాహంగా ఉంది” అని చెప్పారు.

గోపీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ‌్రీధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే:  కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌:  గౌతంరాజు, ఆర్ట్ :  వివేక్‌, నిర్మాత‌:  వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *