
ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. డాక్టర్లు ఇండియా -వెస్టిండీస్ మ్యాచ్ చూస్తూ ప్రమాదంలో గాయపడ్డ సోనూ అనే వ్యక్తికి చికిత్స అందించలేదు. దీంతో మథురలో ఓ నిండు ప్రాణం పోయింది. పాత కక్ష్యల్లో ఓ వ్యక్తి ని తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలోనే కొందరు సోనూను ఆస్పత్రిలో చేర్పించగా.. నర్సులు ప్రాథమిక చికిత్స చేసి మత్తు మందు ఇఛ్చారు.
డాక్టర్లందరూ ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ చూస్తూ సోనూ కు చికిత్స చేయడం మరిచిపోయారు. దీంతో సరైన వైద్యం అందక సోనూ మృతిచెందాడు. డాక్టర్ల క్రికెట్ పిచ్చి వల్ల ప్రాణం పోవడంతో వారి బంధువులు ఆందోళన చేశారు..