
-జనవరి 21న కౌగిలింతల దినోత్సవం
హైదరాబాద్, ప్రతినిధి :
ఒక కౌగిలింత కష్టాలను దూరంచేస్తుంది.. ఒక కౌగిలింత ఆపదలో ఉన్న వాడికి కొండంత ధైర్యాన్నిస్తుంది. ప్రేమికులైన.. సోదరులైన.. బంధువలైన దగ్గరి వారు కనిపిస్తే మొదటగా చేసేది కౌగిలించుకోవడమే.. ఎంతో ఆప్యాయతలను పంచే ఈ కౌగిలింతలకు ఓరోజుందని తెలుసా మీకు.. అది జనవరి 21. ప్రతీ సంవత్సరం విదేశాల్లో దీన్ని జరుపుకుంటారు. ఇప్పడు ఇండియాకు ఇది పాకింది.
జనవరి 21న కౌగిలింతల దినోత్సవంను అమెరికాలో ఘనంగా జరుపుకుంటారు. ఇది అమెరికాలో 1986లో ప్రారంభమైంది. ఈ కౌగిలింతల దినోత్సవాన అందరూ ఒకరినొకరు హగ్ చేసుకొని శుభాకాంక్షలు తెలుపోవడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇఫ్పడు ఈ ఫీవర్ ఇండియాకు పాకి యువత, ప్రేమికులు జనవరి 21 కౌగిలింతల దినోత్సవం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. తమకు నచ్చిన ,నచ్చనివాల్లకు హగ్ తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు యువతరం .. మరెందుకు ఆలస్యం మీరు సిద్ధం కౌగిలింతలకు.. కౌగిలింతల దినోత్సవంకు..