Breaking News

కోహ్లీ సేన వైట్ వాష్ చేసింది..

virat-kohli-ap_m

వన్డేల్లో , టీట్వంటీ సిరీస్ ల్లో దక్షిణా ఫ్రికా చేతుల్లో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. వన్డేల్లో, టీట్వంటీల్లో ధోని నాయకత్వంలో ఆడిన ఇండియా టీ ట్వంటీలో 2-0తో, వన్డేల్లో 3-2 తేడాతో దక్షిణా ఫ్రికా చేతిలో ఓడిపోయింది..

కాగా కోహ్లీ సారథ్యంలో టెస్ట్ సిరీస్ లో బరిలోకి దిగిన టీమిండియా దక్షిణాఫ్రికాను చెడుగుడు ఆడింది. స్పిన్ పిచ్ లతో దక్షిణాఫ్రికా పనిపట్టింది.. దక్షిణాఫ్రికా ఎంత పోరాడినా ఫలితం దక్కలేదు. చివరిదైనా ఢిల్లీ నాలుగో టెస్ట్ లో చివరిరోజు దక్షిణాఫ్రికా డ్రాకోసం బాగా పోరాడింది. అయినా భారత బౌలర్లు సౌతాఫ్రికాను ఆలౌట్ చేసి సిరిస్ ను 3-0తో వైట్ వాష్ చేసి దక్షిణాఫ్రికాను ఘోరంగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది..

చివరి టెస్ట్ లో రెండు సెంచరీలు చేసిన రహానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. మొత్తం టెస్ట్ సిరీస్ లో 32 వికెట్లు తీసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యారు.

కాగా చివరి రోజు దక్షిణాప్రికా కెప్టెన్ ఆమ్లా, డివిలర్స్ దాదాపు 90 ఓవర్లపాటు ఇండియా బౌలర్లను ఎదుర్కొని డ్రాకోసం ప్రయత్నించినా వారివల్ల కాలేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *