
సిడ్నీ, ప్రతినిధి : మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 342/5 పరుగులతో పోరాడుతోంది. సిడ్నీ టెస్టులో ఇండియా బ్యాట్స్ మెన్ రాణిస్తున్నారు. ఓపెనర్ లోకేష్ రాహుల్ కెరీర్లో ఫస్ట్ సెంచరీ(110) చేశాడు. దీనికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ చేయడంతో, ఇండియా 115 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 342 రన్స్ చేసింది. విరాట్ కోహ్లి(140 నాటౌట్), వృద్ధిమాన్ సాహా(14) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 572 రన్స్ కు డిక్లేర్ చేసింది. రైనా డకౌట్ అయి వెనుదిరిగారు.