కోల్ కతపై హైదరాబాద్ గెలుపు

వైజాగ్ : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ 55 బంతుల్లో 91, ధావన్ 46 బంతుల్లో 54 పరుగులు , నమన్ ఓజా 8 బంతుల్లో 18 పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధించింది.

అనంతరం మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం కోల్ కతా లక్ష్యాన్ని 12 ఓవర్లలో 118 పరుగులకు కుదించారు. కోల్ కతా పూర్తి ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులే చేయగలిగింది.ఉతప్ప 34, మనీస్ పాండే 33 , రసెల్ 19 పరుగులు చేశారు. దీంతో కోల్ కత ఓడిపోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *