కోట్లు ముంచి.. దేశం దాటేసి.. తిరిగి రానంటున్నాడు..

దాదాపు 9వేల కోట్లు భారత బ్యాంకులకు ముంచేసి దర్జాగా దేశం దాటి లండన్ లో తిష్టవేసిన బడా వ్యాపారి విజయ్ మాల్యా ఇప్పుడు కేసుల భయంతో భారత్ కు తిరిగిరానంటున్నారు.. వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసినా బారత ప్రభుత్వం అతడిని ఏమీ చేయలేని నిస్సహాయత.. అదే ఓ పేదోడి అప్పు తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇటీవల తమిళనాడులో ఓ పేద రైతు తన పొలం కోసం లక్ష తీసుకొని తీర్చుకోకపోతే ఏకంగా పోలీసుల చేత కొట్టించారు  బ్యాంకు సిబ్బంది.. ఇప్పుడు బ్యంకు సిబ్బంది చేసిన పనికి సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఎందుకంటే..దేశంలోనే బడా పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా దాదాపు 9000 కోట్ల రూపాయలను దేశంలోని వివిధ బ్యాంకులనుంచి రుణం తీసుకున్నారు. విమాన, మద్యం, రియల్ ఎస్టేట్ సహా చాలా కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయి తీర్చేమార్గం లేక ఎగ్గొట్టాడు.

ఇంత దారుణంగా మోసం చేసినా కనీసం అతడిని విచారించే ధైర్యం, దమ్ము ఈ ప్రభుత్వానికి లేకుండాపోయింది. కనీసం కోర్టు లుక్ అవుట్ నోటీస్ జారీ చేసి దేశం దాటి వెళ్లిపోవద్దని నోటీస్ ఇచ్చినా అతడు దర్జాగా దేశం దాటిపోవడం మన ప్రభుత్వాల ఉదాసీనతకు అద్దం పడుతోంది.లక్ష రూపాయలు తీసుకొని ఎగ్గొట్టిన రైతును చితక్కొట్టిన పోలీసులు.. 9వేల కోట్లు ఎగ్గొట్టి ఏకంగా దొంగతనంగా లండన్ చెక్కేసిన విజయ్ మాల్యాను ఎంతలా చితకబాదాలి. కానీ డబ్బున్న వాళ్ల పక్షమే మన వ్యవస్థలు పనిచేస్తాయి. సామాన్యుడి రోదన అరణ్యరోదనే అవుతుంది. వేలకోట్లు ఎగ్గొట్టిన ఆసామికి సలాం కొడుతాయి.. ఇదే మన దేశ దౌర్భాగ్యం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *