
ఇన్నాళ్లు వారు ఆడిందే ఆట.. ఉద్యోగ ప్రకటనలు పడడమే ఆలస్యం నిరుద్యోగులకు వల వేస్తూ ఇష్టమొచ్చినొట్టు ఫీజులు భారీగా పెంచి కోచింగ్ ల పేరుతో లక్షలకు పడగలెత్తుతాయి కోచింగ్ సెంటర్లు కానీ.. ఇక తెలంగాణ ప్రభుత్వంలో అవి కుదరదు.. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గతంలో విడుదలైన జీవో 200 కు మెరుగులు దిద్ది కోచింగ్ సెంటర్ల కు చెక్ పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఇక నుంచి కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ఫీజుగా రూ.1000, ట్యూటోరియల్ డిపాజిట్ గా పదివేలను చెల్లించాల్సి ఉంటుంది. ఒక సారి సర్టిఫికెట్ పొందితే 5 ఏళ్ల వరకు కోచింగ్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఎంతమంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఏఏ అధ్యాపకులు లెక్చరర్లు భోధిస్తున్నారనో ప్రభుత్వానికి నివేదించాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, లెక్చరర్లు కోచింగ్ సెంటర్లలో బోధిస్తున్నట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇన్నాళ్లు ఆంధ్రా కోచింగ్ సెంటర్ల పేరుతో వేలకు వేలు ఫీజులు వసూలు చేసి .. కోచింగ్ ఇచ్చిన కార్పొరేట్ స్రామాజ్యాలకు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవోతో ఆట కట్టినట్టైంది. ఇక ముంతు కోచింగ్ సెంటర్ల ఆగడాలపై నిఘా పెంచేందుకు ప్రభుత్వం డీఈవో, ఆర్జేడీలకు పాఠశాల కమిషనర్ ఫుల్లుగా అధికారాలు ఇచ్చారు. దీంతో కోచింగ్ సెంటర్లకు ఇక గడ్డు కాలమే..