
హైదరాబాద్, ప్రతినిధి : తన ఎమ్మెల్యేలతో కట్టుకథలు చెప్పించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ముందుంన్నారని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో కొల్లేరు అంశంపై జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తొమ్మిదేళ్లుగా సీఎంగా ఉన్నారని అప్పుడు కొల్లేరు సమస్యపై ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్మానం చేశారని… అయితే అది కేంద్రం పరిధిలో ఉండిపోయిందని.. ఇప్పుడు కొత్తగా ఏదో తీర్మానం చేసినట్లుగా టీడీపీ బిల్డప్ ఇస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా కొల్లేరుపై ప్రభుత్వం తీర్మానం చేసినందుకు చాలా సంతోషమని, అ అంశంపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది కాబట్టి అందరం కలిసికట్టుగా కేంద్రాన్ని కలుద్దామని… దీనికి వైసీపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని జగన్ స్పష్టం చేశారు.