Breaking News

కొలువుదీరిన అమ్మలు.. పోటెత్తిన భక్తులు

Sri-Sammakka-Saralamma-Jatara

సమ్మక్క సారలమ్మ జాతర పరిపూర్ణమైంది.. గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు కొలువుదీరారు. దీంతో జాతర ఉత్స స్థితికి చేరింది. భక్తులు అమ్మలు గద్దెనెక్కడంతో దర్శించుకునేందుకు తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే 50 లక్షలకు పైగా జనం  సమ్మక్కసారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

కాగా ఇదే అదనుగా మేడారంలో ధరలు ఆకాశన్నంటాయి.. ఒక్కో కోడి 160 రూపాలుంటే దాన్ని 500 రూపాయలకు పెంచారు. మేకలు, గొర్రెల ధరలైతే పదివేల పైనే ఉన్నాయి.. టిఫిన్లు, తినుబండారాల ధరల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచారు.దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లక్షల మంది రావడంతో ట్రాఫిక్ , పోలీసులు అగచాట్లు పడుతున్నారు..

కాగా సీఎం కేసీఆర్ మేడారం పర్యటన రద్దయ్యింది. ఆయన జ్వరంతో వెళ్లకపోవడంతో మంత్రి కేటీఆర్ వరంగల్ లో కేసీఆర్ ప్రారంభించాల్సిన ఐటీ సెంటర్ ను ప్రారంభించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *