
“” కొమురం భీం””
దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు పోరాటాలు, ఉద్యమాలు చేశారు..
ఆఖరికి ప్రణత్యాగాలు చేసిన ఎందరో స్వతంత్ర సమరయోధులు ఉన్నారు..
అటువంటి యోధుల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే!
ఆ మహనీయుల రుణం ఎన్ని జన్మలెత్తిన తీర్చుకొలేం
ఈరోజు ఒక గొప్ప పోరాట యోధుని
గురించి చెప్పుకుందాం..
ఆ వీరుల త్యాగాలను స్మరించుకుందాం..
ఆదివాసుల పెన్నిధి, గోండు జాతుల బొబ్బులి..
గిరిజన జాతుల్లో ఉద్యమ కాంక్ష రగిలించిన విప్లవ యోధుడు..
అస్థిత్వాల వేగుచుక్క!అతడే కొమురం భీం..
ఈ పెరువింటే ప్రతిఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకునే పౌరుషం వస్తుంది.
అతని పోరాటాల పటిమే వెల్లువిరుస్తుంది..
అదిలాబాద్ జిల్లా,అసిఫాబాద్ తాలూకకు చెందిన సంకెపెళ్లి గ్రామంలో
గిరిజన గోండు జాతికి చెందిన
తల్లి :సోంబారు తండ్రి:చిన్నూ అనే దంపతులకు
1901లో అక్టోబర్22న జన్మించాడు కోమురం భీం..
అక్కడి గోండు జాతి ప్రజలు పారె సెలయేళ్లా వలే ఎటువంటి కల్మషం లేకుండా బతికేవాళ్ళు..
వాళ్లకు ఆపద ఉందని తెలిస్తేనే ఎలాంటి క్రూరమృగలైన మట్టుపెట్టగల సత్తా వాళ్ళ స్వంతం..
ఆదివాసీ, గిరిజన, గోండుజాతులపై
నిజం సర్కార్ సాగించిన దౌర్జన్యం, అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..
అ సమయంలోనే కొమురం భీం తండ్రిగారు చిన్నూ నిజం కు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళచేతుల్లోనే హతం అయ్యాడు..
కొమురం బీం 15 ఏండ్ల వయసులోనే అతని తల్లి సోంబారు కూడా మరణించింది..
చిన్నతనం నుండే కొమురం భీం వ్యవసాయం సాగుచేసుకుంటు జీవనం సాగిస్తున్న కాలంలో
ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో
ఆవేశం పట్టలేని కొమురం భీమ్ అతన్ని హతమార్చి అస్సాం కు పారిపోయాడు.
అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ అక్కడే రాయడం,చదవడం నేర్చుకున్నాడు..
అస్సాం టీ-ఎస్టేట్లలో పనిచేస్తున్న సమయంలోనే
ఆంధ్రా ప్రాంతానికి చెందిన తోటి కార్మికుడి నుంచి మన్యం దొర అల్లూరి సీతారామ రాజు పోరాటాల గురించి కోమురంభీమ్ తెలుసుకున్నాడు.
ఆయుధాలు లేకపోయినా, ఆశయమే ఆయుధంగా బ్రిటీష్ వాళ్లపై పోరాడినా.
అల్లూరి తిరుగుబాటు కథనాలు వీన్నా కొమురం భీంలో మళ్ళీ పోరాటాల స్ఫూర్థి నింపుకున్నాడు..
ఇక తాను అక్కడ ఉండటం సరైందికాదని భావించిన భీం తన వాళ్ల కోసం తిరిగి తన సొంత ఊరికి చేరుకున్నాడు..
భీమ్ తిరిగి వచ్చేసరికి తమవారు మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడం చూసి చలించిపోయాడు.
ఈ బానిసత్వం వద్దని తిరుగుబాటు జెండా ఎగరవేశాడు.
జల్,జంగల్,జమీన్ అనే నినాదం ఎత్తుకున్నాడు.
ఈ నీరు,ఈఅడవి,ఈభూమిపై హక్కులు తమవేనంటూ ఉద్యమం ప్రారంభించాడు.
ఏ నాటికైనా చచ్చేదే, ఈ బ్రతుకు కంటే చావడమే మేలు అంటూ తన వాళ్లలో ఉద్యమ స్పూర్థిని రగిలించాడు.
మేమూ తోడవుతాం అంటూ ఒక్కొక్కరుగా కొమరం భీమ్ అనుచరులుగా తరలివచ్చారు.
ఇక వారితోనే జోడేఘాట్ కేంద్రంగా ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి నిజాం పాలకులపై గెరిల్లా పోరాటాలకు దిగాడు కోమురంభీమ్.
భీమ్ కు కుడిభుజంగా కొమురం సూరు,వెడ్మరాము ఇద్దరు సహచరులుగా అండగా నిలిచారు..
వీరిద్దరూ కూడా అప్పటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన యోధులే!
కొండ కోనల్లో , ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసులకె అడవి పై హక్కు ఉంటుందని
అది సామజిక న్యాయంలో భాగమని ..
నిలదిస్తూ 1928 నుంచి 1940 వరకు రణభేరి మోగించిన కొమరం భీమ్ ..
నైజాం సర్కారు గుండెల్లో సింహ స్వప్నంగా మారడు
అలాంటి పోరాట యోధుడైన కోమురం భీం..
కుర్దు పటేల్అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో,
అర్థ రాత్రి జోడేఘాట్ అడవుల్లోని, కొమురం భీమ్ స్థావరాన్ని చుట్టుముట్టింది నిజాం సైన్యం.
భీం ని హతహమార్చడానికి వచ్చిన నిజాం సైన్యం మీద అటవీ సిబ్బంది మీద కోమురం భీం కోదామసింహం లా గర్జించాడు..
చివరకు అక్టోబర్ 27 1940 రోజున అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున నిజం సైన్యం చేతిలో చివరకు కొమురం భేమ్ వీరమరణం పొందరు..
ఇలాంటి అమరవీరుల త్యాగాలు మారవలేనివి..
భూమికొరకు భుక్తి కొరకు విముక్తి కొరకు ,పోరాడిన కోమురం భేమ్ చరిత్రలో చెరగని ముద్ర వేసుకొని, అందరి కి ఉద్యమాల స్ఫూర్తిని ఇచ్చాడు
జోహార్ జోహార్