కొప్పులకు మంత్రి పదవి ఖాయమట..

2-koppula-eshwar

మంత్రి కొప్పులకు మంత్రి పదవి దక్కనుందనే ప్రచారం జోరందుకుంది. సీఎం కేసీఆర్ గవర్నర్ ను నిన్న రాత్రి కలిసి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, కొందరి శాఖల మార్పుపై విస్తృతంగా చర్చించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో కొప్పుల ఈశ్వర్ కు చోటు లభిస్తుందనే ప్రచారం ఊపందుకుంది.

తొలి పునర్వ్యస్థీకరణలోనే ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కాల్సి ఉండేది. కానీ ఈటెల, కేటీఆర్ లు కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఒక జిల్లాకే 3 మంత్రి పదవులు అవుతాయని భావించి కొప్పులకు మంత్రి పదవి దక్కలేదు. ఒకానొక సమయంలో కొప్పులకు రాజయ్య సస్పెన్షన్ తరువాత డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందనే ప్రచారం జరిగినా అప్పుడు నెరవేరలేదు.. కాగా ఇప్పుడు కేసీఆర్ మళ్లీ మంత్రి వర్గాన్ని పునర్వ్యస్తీకరించేందుకు నిర్ణయం తీసుకోవడంతో కొప్పులకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *